
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి,సుల్తానాబాద్, గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వేడుకలు జరుపుకోవడం మన గొప్ప విషయం, మన అదృష్టమని అన్నారు. అంబేద్కర్ అందరివాడని.. ఆయనకు కులాన్ని ఆపాదించొద్దని అన్నారు. కుల వివక్షను తిప్పి కొట్టాలని సూచించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.
అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ రాజ్యాంగం రచించారని.. రాజ్యాంగాన్ని మార్చాలని కొందరు చూస్తున్నారని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి తో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని అన్నారు. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ ను దూరం చేయాలని ఎన్ని కుట్రలు చేసినా అవి ఫలించవని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అనాడు రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అని అన్నారు.
ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ ను దూరం చేయాలని ఎన్ని కుట్రలు చేసినా అవి ఫలించవని.. సంవీదన్ ప్రకారమే భారతదేశం ముందుకు పోతుందని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని.. రాజ్యంగాన్ని మార్చాలని చూస్తే అది వారి అవివేకం అవుతుందని అన్నారు. భారతదేశానికి దారి చూపింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని అన్నారు ఎమ్మెల్యే వివేక్.