
కోల్‌బెల్ట్/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. డాక్టర్లు, స్టాఫ్ కొరత ఉన్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యే డాక్టర్ వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ఆయన ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్మాట్లాడుతూ.. కనీసం వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ట్రీట్మెంట్ కూడా అందడం లేదన్నారు.
30 బెడ్లఆసుపత్రికి సరిపడా సౌలత్లు లేవన్నారు. సర్జికల్ ఆపరేషన్ థియేటర్, డయాలసిస్యూనిట్లు ఏర్పాటు చేసి, డాక్టర్లు, స్టాఫ్‌ను రిక్రూట్చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్మూల రాజిరెడ్డి, మంచిర్యాల జిల్లా సూపరిటెండెంట్డాక్టర్ అరవింద్, చెన్నూరు ఆసుపత్రి డాక్టర్ సత్యనారాయణ, లీడర్లు పాల్గొన్నారు.
అనంతరం చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ ను ఎమ్మెల్యే వివేక్ సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత బైక్‌పై పట్టణంలో పర్యటించారు. కిరాణం షాప్ యజమాని హీరోలాల్, కురుమ పున్నం, అన్నపూర్ణ వృద్ధాశ్రమం నిర్వాహకులు పుల్లూరి సత్తయ్య, పడమటిరెడ్డి శ్రీనివాస్, వెంకన్న, చింతల శ్రీనివాస్, కొత్తగూడెం కాలనీలోని ఇటీవల గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త తగరం కృష్ణ కుటుంబాలను కలిశారు.
మున్సిపాలిటీలకు డీఎంఎఫ్టీ ఫండ్స్ అవసరం
డీఎంఎఫ్టీ ఫండ్స్‌ను మున్సిపాలిటీల అభివృద్ధికి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన క్యాతనపల్లి మున్సిపల్ జనరల్‌బాడీ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.37 కోట్లను రోడ్వైడనింగ్కు కేటాయించడం సరికాదన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల కోసం డీఎంఎఫ్టీ ఫండ్స్ ఖర్చు చేస్తే సౌలతులు పెరుగుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్‌ను చైర్మన్జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, కమిషనర్ వెంకటనారాయణ, మేనేజర్ నాగరాజు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, ఆర్జీ, అంగన్వాడీ టీచర్లు సన్మానించారు.
అంతకు మందు ఆదిలాబాద్వెళ్తున్న మంత్రి సీతక్క మంచిర్యాలలోని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంటికి వచ్చారు. వివేక్ మంత్రికి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన మహా పడిపూజలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.