
- స్పీకర్ని గౌరవించడం మన అందరి బాధ్యత
- కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ o చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి: ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి కీ కూడా ఆపార్టీ లీడర్లకు ఇంకా అహంకారం తగ్గలేదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా మి అన్నారు. వారి తీరు చూస్తుంటే ఇంకా అధి కారంలోనే ఉన్నామనే భ్రమలోనే ఉండి ఇష్టా రాజ్యాంగ మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. స్పీకర్ పదవిలో ఉన్నవారిని గౌరవించడం మన అందరి బాధ్యతని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట్ లోని శ్రీ మల్లికార్జున స్వామి, దొంగతుర్తిలో వెంకటేశ్వర స్వామి వార్లను ధర్మపురి ఎమ్మెల్యే.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ 'స్పీకర్ పదవిలో ఉన్న వారిని అగౌర వపరిస్తే సస్పెండ్ చేసుడు న్యాయమే. రాష్ట్రరా జకీయాలను నాశనం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు ఓడించారు. నిన్నఅసెంబ్లీలో దళితుడైన స్పీకర్ పై మాట్లాడిన తీరు దళితలపై మీ వ్యతిరేకత కనిపించింది. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది' అని తెలిపారు.
మీ ప్రేమ మరువలేనిది:
'గోపాల్ రావు పేట గ్రామంతోమా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. మీరు చూపే ప్రేమ మరువలేనిది. నేను ఎంపీగా ఉన్న రోజుల్లో ఇక్కడ బ్రిడ్జి మంజూరు చేయించా. గ్రామస్తుల కోరిక మేరకు విశాఖ ట్రస్ట్ నుంచి పాఠశాలల విద్యార్థులకు బెంచీలు అందించాం' అని వివేక్ తెలిపారు. అనంతరం ఇటీవల వివాహం జరిగిన పెద్దపల్లి పట్టణానికి చెందిన భూషణ్వేనా రమేష్ గౌడ్ కూతురు, అల్లుడిని ఆశీర్వదించారు. అలాగే పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలువక రాజయ్య ఏర్పాటు చేసిన లంచ్ కు హాజరయ్యారు.