చెన్నూర్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతంలో సహకార సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయమని.. అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సహకార సంఘాల్లో ములుకనూరు సహకార సంఘం చాలా మంచి సొసైటీ గా పేరుగాంచిందని అన్నారు. మూలుకనూరు సొసైటీ లాగా చెన్నూర్ లో కూడా ఏర్పాటు చేసుకోవాలని,రూ. 500 కోట్లతో చెన్నూరులో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు వివేక్ వెంకటస్వామి.
ALSO READ | ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
పేద ప్రజలకు సహకారం అందించడం చాలా మంచి విషయమని, సహకార సంఘాల వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి పరచాలని అన్నారు. ఏదైనా సహకారం కావాలి అంటే తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసం పని చేస్తుందని.. 6 గ్యారంటీ లు అమలు చేసామని అన్నారు. సోమనపల్లిన్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేయడం జరిగిందని.. చెన్నూర్ లో అన్ని రకాల సదుపాయాలతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే గా లేనప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ లో విశాఖ ట్రస్టు నుండి బోర్లు వేశామని అన్నారు వివేక్ వెంకటస్వామి.