- త్వరలోనే మరో రూ. 80 కోట్లను కేటాయిస్తం
- నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇండ్లు
- నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా
కోల్ బెల్ట్ : చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే మోడల్నియోజకవర్గంగా మారుస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. జనవరి నుంచి నియోజకవర్గంలో 3 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. చెన్నూరులో ప్రస్తుతం రూ. 70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే మరో రూ. 80 కోట్లతో అభివృద్ధి పనులను స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
జైపూర్ మండల్ టేకుమట్ల గ్రామంలో ఇటీవల ఎస్ టీపీపీ రైల్వే ట్రాక్ కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విద్యార్థి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ. 15.లక్షల పరిహారం చెక్కు ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందించారు. అనంతరం -టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. -టేకుమట్ల లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి, భీమారంలో అర్హులైన లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
నేషనల్ హై వే 63లో భీమరం మండలం జోడు వాగుల వద్ద రు. 1.80కోట్లతో చేపట్టనున్న రోడ్ మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదు. త్వరలో నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులందరికీ స్కూల్బ్యాగులు ఇచ్చేందుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. టేకుమట్లలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిహారాన్ని అందించాను.
విద్యార్థి పడిన గుంత సింగరేణి సంస్థ ఏరియాలోనిది కాదని మేము పరిహారం ఇవ్వలేము అని సింగరేణి సంస్థ నిర్లక్ష్యం చేసింది. సింగరేణి సంస్థ తో కొట్లాడి బాధిత కుటుంబానికి ఈ పరిహారం అందించడం జరిగింది. ఈ విషయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లాను. త్వరలోనే వారి ఫ్యామిలీలో ఒక్కరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తా. డీఎంఎఫ్ టీ ఫండ్స్ రూ. 17 లక్షలతో టేకుమట్ల లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామం నుంచి గోదావరి నది వరకు రోడ్డు కావాలని అడిగారు. ఈజీఎస్ ఫండ్ క్రింద త్వరలో రోడ్డు పనులు చేపడతాం.
ALSO READ : న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
చెన్నూరు ప్రాంతంలో మంచి విద్యను అందించేందుకు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించా, త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి. నేషనల్ హైవే63లో రూ. 100 కోట్లతో పనులను మంజూరు చేయించం. టెక్నికల్ సమస్య తో టెండర్జాప్యం జరుగుతుంది. ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కలెక్టర్ దీనిపై సమీక్షా జరపాలని ఆదేశిస్తున్న. దశలవారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ రుణపడి ఉంటాం’ అని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.