
తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయల నిధులను వృధా చేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పని చేస్తుందన్నారు. బీజేపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ల కోసం పని చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. బీజెపీ పార్టీ రాముడి పేరుతో రాజకీయం చేస్తుందని.. రాముడు మన అందరికీ దేవుడే కాబట్టి అభివృద్ధి ఎవరూ చేస్తారో వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
.