పెద్దపల్లి: రైతు సమస్యలపై రాష్ర్టంలో ధర్నాలు చేసే బదులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో కొనుగోలు చేసిన వడ్లను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ర్యాకల్, దేవుపల్లి గ్రామాల్లోని రైస్ మిల్లులు, గోడౌన్లలో వడ్ల దిగుమతి ప్రక్రియను ఇవాళ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చెన్నూరు నియోజకవర్గ రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వడ్లను సుల్తానాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
Also read :నా పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేస్తే సహించ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి అమలు చేస్తున్నారని తెలిపారు. సన్న రకం వడ్లకు రూ. 5 వందల బోనస్ ఇస్తామన్నారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్మేనిఫెస్టోలో పేర్కొన్నామన్నారు. బీజేపీ మాత్రం మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావనే తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మాత్రం బీజేపీ లీడర్లు రైతు సమస్యలపై ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వడ్లకు సరిపడా ఎఫ్ సీఐ గోడౌన్లను కేటాయించడంలో విఫలమయ్యారన్నారు. రైతులను బీజేపీ ఏనాడు కోలేదన్నారు. అనంతరం హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వారి పనితీరు పట్ల అభినందనలు తెలిపారు.