అంబేడ్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఆదివారం ( డిసెంబర్ 1, 2024 ) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ సక్సెస్ మీట్ నిర్వహించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్.  మాలల  హక్క్కల సాధన కోసం జరిగిన మాలలసింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో లక్షలాది మాలలు సభకు తరలి వచ్చి మాలల సత్తా చాటారని అన్నారు. అంబెడ్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఈ సభ ద్వారా స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చామని అన్నారు.

ALSO READ : మాలల ఆత్మ గౌరవం, ఐక్యతను చాటి చెప్పాం: ఎమ్మెల్యే వివేక్

వర్షాన్ని కూడా లెక్క చేయకుండా.. మాలల ఐక్యతను చాటి చెప్పేలా సభను సక్సెస్ చేసిన మాల నాయకులూ, కులస్థులు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్బంగా.. పలువురు నాయకులు ఎమ్మేలే వివేక్ వెంకట స్వామి సన్మానించారు.మాలల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, హక్కుల పోరాటినికి అందరు కలిసి రావాలని.. మహా గర్జనలో అన్ని రాజకీయపార్టీల నాయకులు పిలుపునిచ్చారని అన్నారు ఎమ్మెల్యే వివేక్.

  • Beta
Beta feature