- మీడియా రంగానికి గుర్తింపు తెచ్చారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- రామోజీ ఫ్యామిలీకి పరామర్శ
హైదరాబాద్, వెలుగు: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఎందరికో ఆదర్శమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో రామోజీరావు కన్నుమూయడంతో ఆయన కుటుంబాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో వివేక్ పరామర్శించారు.
రామోజీ కొడుకు కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరిలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు, రామోజీ రావు ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మీడియా రంగానికి గుర్తింపు తీసుకురావడంలో రామోజీ ఎంతో కృషి చేశారని వివేక్ వెంకటస్వామి అన్నారు. తన గళాన్ని బలంగా వినిపించారని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.