చెన్నూరు రూపురేఖలు మారుస్తా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 ఎక్కువ నిధులు మంజూరు చేసి చెన్నూరు  రూపురేఖలు మారుస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చెన్నూర్ మున్సిపాలిటీలో డీఎంఎఫ్ టీ పనులకు సంబంధించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు చెన్నూరు మున్సిపాలిటీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. 

చెన్నూర్ మున్సిపాలిటీలో అభివృధి కొరకు నిధులు మంజూరు చేశా..  ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు.  ఇంకా ఎక్కువ నిధులు మంజూరు చేసి చెన్నూర్ రూపు రేఖలు మారుస్తామన్నారు.  త్వరలోనే నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు వివేక్ .

రేషన్ కార్డు లిస్టుల్లో పేర్లు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే వివేక్.  అర్హత ఉన్నవారికి త్వరలోనే  తప్పకుండా రేషన్ కార్డులు  అందిస్తామన్నారు.   ప్రజా పాలనలో అప్లై చేయని వాళ్లు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పారు వివేక్ వెంకటస్వామి