రాముడి కథలు,పాటలు వింటే మంచి ఆలోచనలు కలుగుతయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్ పల్లి రామాలయాంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి దంపతులు. రాముడి భజన కార్యక్రమంలో పాల్గొని భక్తిపారవశ్యం పొందారు. రాముడి కథలు, పాటలు వింటే మంచి ఆలోచనలు కలుగుతాయన్నారు ఎమ్మెల్యే వివేక్. రోజు ఉదయం తాను సైతం రాముడి కీర్తనలు వింటానన్నారు. రాముడి ఆశీస్సులతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరారు ఎమ్మెల్యే వివేక్ సతీమణి సరోజా. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  శ్రీరాముడి ఆశీస్సులతో అందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్ధించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.