ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్

ఎస్సీలకు 20%  రిజర్వేషన్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్
  • కులగణన సర్వేలో తేలిన మాల, మాదిగల లెక్కలు బయటపెట్టాలి: వివేక్ వెంకటస్వామి 
  • మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినం
  • మాల, మాదిగ, నేతకానిలకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. కులగణన సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయటపెట్టాలని, తద్వారా తమలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకుంటామని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో వివేక్ మాట్లాడారు. ‘‘ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు సభ పెట్టారని అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాలల సంఖ్య తక్కువగా ఉందంటూ కొందరు మా జాతిని కించపర్చేలా మాట్లాడారు. దీంతో మేం ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టాం” అని వివేక్ స్పష్టం చేశారు.

‘‘ఎస్సీల రిజర్వేషన్లు  20 శాతానికి పెంచాలని ఇదే సభలో తీర్మానం చేశాం. కొత్తగా కులగణన చేయాల్సిందేనని కూడా తీర్మానించాం” అని వివేక్​ గుర్తు చేశారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో 7 నుంచి 8 శాతం తేడా కనిపిస్తోంది. మేం హర్యానా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో రిజర్వేషన్లపై స్టడీ చేశాం. ఎస్సీలకు పంజాబ్ లో 20శాతానికి కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉన్నాయి. హర్యానాలో 20 శాతానికి పెంచారు. తమిళనాడులోనూ 3 శాతం పెంచి విభజన చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనూ ఎస్సీ రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలి” అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఈ లెక్కలు సరిగా ఉన్నాయో? లేదో? అనే భయాందోళన మాలల్లో ఉందన్నారు.

ఎస్సీలకు బడ్జెట్లోనూ18 శాతం నిధులు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. నిధులు లేక కొన్నేండ్లుగా ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్లకు సబ్సిడీ రావడం లేదన్నారు. అన్ని రకాల కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం కేటాయించాలని గతంలో తాను డిమాండ్ చేశానని, కానీ గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేయలేదన్నారు. ‘‘చేవెళ్ల డిక్లరేషన్ లో భాగంగా మాల, మాదిగ కార్పొరేషన్లతో పాటు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.  ‘‘ఎస్సీల రిజర్వేషన్లు  20 శాతానికి పెంచాలని ఇదే సభలో తీర్మానం చేశాం. కొత్తగా కులగణన చేయాల్సిందేనని కూడా తీర్మానించాం” అని వివేక్​ గుర్తు చేశారు.

‘‘ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో 7 నుంచి 8 శాతం తేడా కనిపిస్తోంది. మేం హర్యానా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో రిజర్వేషన్లపై స్టడీ చేశాం. ఎస్సీలకు పంజాబ్ లో 20శాతానికి కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉన్నాయి. హర్యానాలో 20 శాతానికి పెంచారు. తమిళనాడులోనూ 3 శాతం పెంచి విభజన చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనూ ఎస్సీ రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలి” అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు.

ఈ లెక్కలు సరిగా ఉన్నాయో? లేదో? అనే భయాందోళన మాలల్లో ఉందన్నారు. ఎస్సీలకు బడ్జెట్​లోనూ18 శాతం నిధులు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. నిధులు లేక కొన్నేండ్లుగా ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్లకు సబ్సిడీ రావడం లేదన్నారు. అన్ని రకాల కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం కేటాయించాలని గతంలో తాను డిమాండ్ చేశానని, కానీ గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేయలేదన్నారు. ‘‘చేవెళ్ల డిక్లరేషన్ లో భాగంగా మాల, మాదిగ కార్పొరేషన్లతో పాటు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి” అని ప్రభుత్వాన్ని కోరారు.