
కోల్‌బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనార్యోగంతో బాధపడుతున్న వేలాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ నగేశ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల అనారోగ్యంతో శివ్వారం మాజీ సర్పంచి గణేశ్తల్లి చనిపోగా ఆయనను, పౌనూర్కు చెందిన మంతెన కుమార్ అనే యువరైతు ఆత్మహత్య చేసుకోగా, అదే గ్రామానికి చెందిన రైతు కర్రు రాజయ్య తల్లి రాధమ్మ ఆనారోగ్యంతో చనిపోగా ఆ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. చెన్నూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్‌కు సీఎం రిలీప్ ఫండ్ చెక్కు అందజేశారు.