
గండిపేట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పీసీసీ చీఫ్‌గా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్‌ను నార్సింగిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్‌రావుతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తున్నామని చెప్పారు.