కాంగ్రెస్ పార్టీ వచ్చాక రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురిచేశారన్నారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆరోపణలు చేసినా తాను ఎవరిపైనా కేసులు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వంలో అందరూ ఇసుక దందాలు, భూ దందాలు,బియ్యం దందాలు చేశారని ఆరోపించారు. తాను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా నిజాయితీగా పని చేస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.
జాతీయ పార్టీ పెట్టి కేసీఆర్ ఇంకా పైసలు సంపాదించాలనుకున్నారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క పైసా లేని కేసీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2లక్షల రుణ మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వివేక్. దేశంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ALSO READ | మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన
వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సత్తా చాటాలన్నారు ఎమ్మెల్యే వివేక్. చెన్నూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని సీఎంను కోరినట్లు తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతానని చెప్పారు వివేక్.