తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఎమ్మెల్యే వివేక్

తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఎమ్మెల్యే వివేక్

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంతకు ముందు ప్రజలపై జులూం చేసే ప్రభుత్వం ఉండేదన్నారు. ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు వివేక్. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

 చెన్నూరు నియోజకవర్గంలో నిత్యం మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వివేక్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు. రోడ్లు, మంచినీళ్లు, స్కూళ్లు.. ఇలా పలు  అభివృద్ధి పనులు చేస్తున్నారు.