బాలుని కుటుంబానికి ఎక్స్​గ్రేషియా, జాబ్​ : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

బాలుని కుటుంబానికి ఎక్స్​గ్రేషియా, జాబ్​ : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

కోల్​బెల్ట్/జైపూర్​,వెలుగు:​  జైపూర్​ మండలం టేకుమట్ల లో నీటి కుంటలో పడి చనిపోయిన బాలుడు చిప్పకుర్తి రాజ్​కుమార్​ బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు.  బాధిత కుటుంబానికి రూ.15లక్షల ఎక్స్​గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్​సోర్సింగ్​ జాబ్​ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.   రమాదేవి , -విష్ణు వర్ధన్  దంపతుల కొడుకు రాజ్ కుమార్ ఆదివారం సింగరేణి తవ్విన నీటి కుంటలో  పడి చనిపోగా..  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, కాంగ్రెస్​ లీడర్లు ఎమ్మెల్యే ను కోరారు. 

దీంతో స్పందించిన ఎమ్మెల్యే  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లారు.  సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో ఎంక్వైరీ చేశారని,    బాధిత కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియో  అందించి  కుటుంబం లో ఒకరికి ఆవుట్​ సోర్సింగ్​ జాబ్​ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు.    ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి  గ్రామస్తులు, కాంగ్రెస్​ లీడర్లు కృతజ్ఞతలు  తెలిపారు.