మంచిర్యాల: ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ( జూలై 23, 2024) చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండల పరిధిలో దేవుల వాడ లో వర్షాలకు బురదమయమైన రోడ్లను పరిశీంచారు వివేక్ వెంకటస్వామి. ఎండ్లబండిపై వెళ్లి గ్రామంలోని వీధులను పరిశీలించారు. గ్రామంలో రోడ్లను నిర్మించేందుకు రూ. 12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్లకు నిధులు కేటాయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామ శివారుల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ప్రాణహిత ఉప్పొంగడంతో పంటలను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి.. పంట నష్టంపై వ్యవసాయాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారిం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
Also Read :- అసెంబ్లీకి వస్తారా..? లేదా..?
చెన్నూరు నియోజకవర్గంలోని అన్నారం, శీర్ష, జనగామ, సుపాక, వెంచపల్లె గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు నీట మునిగాయి.. మంత్రితో మాట్లాడాం.. కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.పంట నష్టంపై వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. ఇటీవల రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేసింది. త్వరలోనే రైతులకు రైతు భరోసాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి.