వరంగల్:తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీలుగా తీవ్ర పోరాటం చేశామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఎన్ని అడ్డంకులు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ వాయిస్ వినిపించేందుకు V6 ఛానల్ పెట్టామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ఛానల్ ద్వారా చాటిచెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గట్టిగా హైకమాండ్ కు చెప్పామన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌర వించి సోనియాతెలంగాణ ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.
పార్లమెంట్ లోపల, బయట రాష్ట్రం కోసం పోరాడమన్నారు. మా నిరసనలు, ఆందోళనలు అడ్డుకునేందుకు యత్నించారు.. అయినా రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ప్రణ బ్ ముఖర్జీకి తేల్చి చెప్పామన్నారు. ఉద్యమ సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన టైం లోనూ చాలా అడ్డంకులు వచ్చాయి.. రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ విషయంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.
సోమవారం (జూన్3) హనుమకొండలో జరిగిన తెలంగాణ దశాబ్ది సంబురాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ఉత్సవాలకు మంత్రులు పొన్న ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామితోపాటు యశస్వినీరెడ్డి, గండ్ర సత్యనారాయణ, వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కీ, అంజన్ కుమార్ గౌడ్, కోదండరాం పాల్గొన్నారు.