
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..ఆదర్శ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నడుచుకోవాలి.. పిల్లలకూ నేర్పించాలి.. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు.
విద్య ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..విద్యతో విజ్ణానం, ధైర్యం వస్తుంది. విద్యతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.. ఆర్థికంగా వెనకబడి ఉన్నా.. అంబేద్కర్ 23 డిగ్రీలు సాధించారు.. అంబేద్కర్ స్పూర్తితో ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ALSO READ | విశాఖ ట్రస్టు ద్వారా ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నాం: సరోజా వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజావివేక్ వెంకట్ స్వామి హాజరయ్యారు. ఆదర్శ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను ఎమ్మెల్యే వివేక్, సరోజ దంపతులు సన్మానించారు.