కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ వచ్చింది : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే స్వేచ్ఛ వచ్చిందని ప్రజలే చెప్తున్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలలుకన్న తెలంగాణను సాధిస్తామన్నారు. ప్రజలు ఇప్పుడు సెక్రటేరియట్ కి వెళ్లి సమస్యలు చెప్తున్నారని అన్నారు. వాటిని పరిష్కరించుకుంటున్నారని అన్నారు. ముళ్ల కంచెలను తొలగించి ప్రజా భవన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్ లోని  జైపూర్ మండల కేంద్రం, మద్దికుంటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు వివేక్ వెంకటస్వామి.