
మంచిర్యాల జిల్లా చెన్నూరులో క్యాంప్ ఆఫీను ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, కొడుకు కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. క్యాంపు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,కాక అభిమానులు భారీగా పాల్గొన్నారు. క్యాంపు ప్రారంభోత్సవం అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.