
- ఆర్ట్ గ్యాలరీలో లైవ్ డ్రాయింగ్సోలో ఎగ్జిబిషన్ ప్రారంభం
మాదాపూర్, వెలుగు: మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించేందుకు చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెన్నూరుఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్ గ్యాలరీలో లైవ్ డ్రాయింగ్ సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. చిత్రకారుడు కళాయాత్ర పోచం చేతి నుంచి జాలువారిన చిత్రాల ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశమంతా తిరిగి మన కల్చర్‌ను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా చిత్రకారుడు కళాయాత్ర పోచం కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ చిత్రాలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా, మన చరిత్రను అందరికీ తెలియజేసే విధంగా ఉన్నాయని తెలిపారు.
భారతదేశ కల్చర్ మొత్తాన్ని తెలుసుకొని 2017 నుంచి 2024 వరకు దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ఆయా రాష్ట్రాల కల్చర్, వ్యవసాయం, సంప్రదాయాలను చిత్రాలుగా గీసినట్టు చిత్రకారుడు పోచం తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ఎంవీ రమణ రెడ్డి, గీతాంజలి వేదిక ప్రిన్సిపల్ సోనియా నాగపాల్, పోచం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.