ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతోనే.. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు

  • క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

కోల్బెల్ట్ వెలుగు: సింగరేణిలో 441 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం, సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చేశారని కాంగ్రెస్ లీడర్లు అన్నారు. గురువారం మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్, రామకృష్ణాపూర్ కాంగ్రెస్ ఆఫీస్లో వేర్వేరు గా సీఎం రేవంత్రెడ్డి. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మందమర్రి. రా మకృష్ణాపూర్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్ గౌడ్, పల్లె రాజు, సీనియర్ నేత సోత్కు సుదర్శన్, పీసీసీ జనరల్ సెక్రటరీ పి.రాఘునాథ్ రెడ్డి మాట్లాడారు. సింగరేణిలో 30 ఏండ్లుగా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటంతో స్థానికులు ఇబ్బం

దులు పడ్డట్లు చెప్పారు. 80శాతం ఉద్యోగాలు స్థాని కులకు దక్కేలా కృషి చేస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు లభించేలా జీవో తేవడం సంతోషకరమన్నారు. ఈకా ర్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, బ్లాక్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, లీడర్లు ఎండి. అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీపీ మహంకాళీ శ్రీని వాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ యాకుబ్ అలీ. ఆకుల రాజన్న, మొట్ట సుధాకర్, మేకల శ్రీనివా స్. పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు. నక్క శ్రీనివాస్, సురేందర్, లాడెన్, రామకృష్ణ, కల్పన, పుష్ప, దీపా, సృజన, మందమర్రి పట్టణ లీడర్లు నె ర్వేట శ్రీనివాస్, ఎర్ర రాజు, పూలూరి లక్ష్మన్. గడ్డం శ్రీనివాస్, సుకూర్, ముదారపు శేఖర్. గడ్డం రజిత, రాధ, స్రవంతి, కదలి శ్రీనివాస్ పాల్గొన్నారు.

జైపూర్: జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ లీడర్లు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ ఫయాజోద్దిన్ ఆధ్వర్యం లో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే జీఓ తీసుకురావ డంతో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ రమేశ్, జనరల్ సెక్రటరీ తిరుపతి రాజ్, టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. చెన్నూరు స్థానికులకు ఉద్యోగాలు వచ్చే కృషి చేసినందుకు కాంగ్రెస్ నాయకులు హేమంత రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వివేక్ వెంకటస్వామి, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఆయనతో నాయకులు మల్లిక్ ఉన్నారు.