భీమారంలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన

భీమారంలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన

భీమారం మండల కేంద్రంలో రూ.1.43 కోట్లతో ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. జైపూర్ మండలం వేలాలలో రూ.20 లక్షల ఫండ్స్‌‌‌‌తో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంత గ్రామాల్లో నిర్మించాల్సిన రోడ్లు, అభివృద్ధి పనులపై జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివాఆశీష్ సింగ్‌‌‌‌తో ఎమ్మెల్యే చర్చించారు. భీమారంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, ఉపాధి హామీ పనిచేస్తూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి చెక్కులు పంపిణీ చేశారు. 

వేలాలలో కలెక్టర్ కుమార్ దీపక్ బీపీని ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెక్ చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీహెచ్‌‌‌‌ఎంవో హరీశ్ రాజ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్, జైపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముస్తఫా, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో సత్యనారాయణ, భీమారం, జైపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఫయాజ్, సీనియర్ నేత చేకూర్తి సత్యనారాయణరెడ్డి, చల్లా సత్యనారాయణ, పోడెటి రవి, జిల్లా సెక్రటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, విశ్వంభర్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, రాజ్ కుమార్, మాజీ సర్పంచులు ప్యాగ శ్యామల, గద్దె రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రామకృష్ణాపూర్ ఆర్కే1 మార్కెట్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ ప్రెసిడెంట్ అఫ్జల్ సోదరుడు సయ్యద్ సర్వర్ అనారోగ్యంతో మృతిచెందగా ఆయన భౌతికకాయాన్ని ఎమ్మెల్యే వివేక్ సందర్శించి నివాళి అర్పించారు. నార్లపూర్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బొలిశెట్టి రాధ బాధిత కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు.