హామీలు ఒక్కొక్కటిగా  నెరవేరుస్తున్నా..

  •     ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  •     చెన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి చెప్పారు. గురువారం చెన్నూరు పట్టణంలోని గోదావరి రోడ్డులో ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద రూ.16లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, కుమ్మరిబొగుటలో రూ.10లక్షలతో కమ్యూనిటీ హాల్​పనులకు, జైపూర్ ​మండలం గంగిపల్లి గ్రామంలో రూ.50లక్షలతో స్కూల్ బిల్డింగ్​ నిర్మాణానికి

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్​ భూమిపూజ చేశారు. చెన్నూరు మున్సిపల్​ చైర్​పర్సన్​అర్చనా గిల్డా, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్​నవాజోద్దీన్, జైపూర్ ఎంఈఓ రాధాకృష్ణ,లీడర్లు పాల్గొన్నారు.

క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్ ​బడ్జెట్ల ఆమోదం

క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎంఎన్​ఆర్​ గార్డెన్స్​లో, చెన్నూరు మున్సిపల్​ఆఫీస్​లో వేర్వేరుగా  నిర్వహించిన మున్సిపల్​ బడ్జెట్​సమావేశాలకు ఎమ్మెల్యే వివేక్​, అడిషనల్​కలెక్టర్ ​రాహుల్ ​చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో ప్రజల అవసరాలకు గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. 2023-–24 ఆర్థిక సంవత్సరానికి గాను క్యాతనపల్లి మున్సిపాలిటీకి

రూ.22.30 కోట్ల బడ్జెట్, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి రూ.17.34 కోట్లు బడ్జెట్​ను ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్ చైర్​పర్సన్లు జంగం కళ, ఆర్చనా గిల్డా, వైస్ చైర్మన్లు ఎర్రం సాగర్​రెడ్డి, నవాజోద్దీన్​, మున్సిపల్​కమిషనర్లు మురళీకృష్ణ, గంగాధర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.