
కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకారమే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలో లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు వివేక్.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడంతోనే రేషన్ మాఫియా తయారయ్యిందన్నారు. త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు వివేక్. రాజీవ్ యువ వికాసానికి నిరుద్యోగులు అప్లై చేసుకోవాలని సూచించారు వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే..అర్హులైన లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.