అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనవరి 21వ తేదీ ఆదివారం మందమర్రి బస్టాండ్ ఆవరణలో పే అండ్ యూజ్ సులబ్ కాంప్లెక్స్ భవనానికి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాయిలెట్స్ లేవని మందమర్రి మార్కెట్ ఏరియా వ్యాపారస్తులు, బస్టాండ్ కి వచ్చే ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పకుండా  సులబ్ కాంప్లెక్స్ భవనాన్ని నిర్మిస్తామని హామి ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. 

ఇచ్చిన మాట ప్రకారం.. బస్టాండ్ ఆవరణలో సులబ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశామని.. త్వరలోనే భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నాణ్యత లోపం లేకుండా క్వాలిటీతో నిర్మించాలని.. వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా భవనాన్ని నిర్మించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు కూడా పే అండ్ యూజ్ చేయాలని.. అప్పుడే ఇక్కడ ఉండే సమస్యలు తెలుస్తాయని వివేక్ అన్నారు.