పోడు పట్టాలున్న వాళ్లు వ్యవసాయం చేసుకోవచ్చు: ఎమ్మెల్యే వివేక్

పోడు పట్టాలున్న వాళ్లు వ్యవసాయం చేసుకోవచ్చు: ఎమ్మెల్యే వివేక్

పోడు భూముల పట్టాలున్నవారు వ్యవసాయం చేసుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్లతో చర్చించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మున్సిపల్, ఫారెస్ట్, ట్రాన్స్ కో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు వివేక్. 

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫారెస్ట్ పర్మిషన్ లేక ఆగిన రోడ్లపై అధికారులతో చర్చించారు. చెన్నూరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు,  త్రాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. రానున్న వర్షాకాలం నేపద్యంలో నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి అధికారులకు చెప్పారు ఎమ్మెల్యే వివిక్.