ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్..

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేశారు.  కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వార్డుల్లో తిరుగుతూ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన పీరిలను దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ అందరికి అండగా ఉంటుందని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు వివేక్ వెంకటస్వామి.