జగదాంబేశ్వరి తల్లి ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జగదాంబేశ్వరి తల్లి ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జగదాంబేశ్వరి (రాజ రాజేశ్వరి) తల్లి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృ ద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు గోశాల, వేద పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కొత్త తిమ్మాపూర్లోని జగదాంబేశ్వరి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. విగ్రహా ప్రతిస్థాపన వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

ALSO READ | నల్గొండలో 12 మంది పంచాయతీ ఆఫీసర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

ఈ సందర్భంగా  మాట్లాడిన వివేక్.. చిన్నారులను పండితులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల సేవలు బాగున్నాయ్ . మంచి పనులు చేయడంతో పాటు ఇతరుల పట్ల సహాయం చేయాలనే గుణం అందరూ అలవర్చుకోవాలి. ఈ రకమైన భావన పిల్లల్లో పెంపొందించాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలో దేవుళ్లే నిజమైన వైద్యులుగా కొలుస్తం' అని తెలిపారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో జరగనున్న శ్రీమ ల్లికార్జున స్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.