
మార్చి చివరి నాటికి చెన్నూరు, మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మార్చి చివరివరకు మిషన్ భగీరథ నీళ్లు చెన్నూరు నియోజకవర్గ మంతటా అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్నీ ఎస్సీ కాలనీల్లో రోడ్లు వేయిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
రేపు(ఫిబ్రవరి 02) సీఎం రేవంత్ ఇంద్రవెల్లి సభకు భారీ సంఖ్యలో జనం తరలివాలన్నారు వివేక్ వెంకటస్వామి. సభను విజయవంతం చేయాలని కోరారు.