చెన్నూర్లో విద్యార్థుల ఆందోళన.. విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్లో విద్యార్థుల ఆందోళన.. విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్ లో  మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహం దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు.  ఇటీవల విద్యార్థుల గొడవ విషయంలో... ప్రిన్సిపాల్ కేవీ ఎం ప్రకాష్ ను విధులనుంచి తొలగించారని ఆందోళన చేపట్టారు విద్యార్థులు. ప్రిన్సిపాల్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  

విద్యార్థుల ఆందోళన విషయం ఆరాదీసిన  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే   విచారణ చేయాలని  ఏసీపీకి ఆదేశాలు జారీ  చేశారు. విద్యార్థులు ఆందోళన చేయడానికి గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు.  విద్యార్థుల ఆందోళనలకు ప్రేరేపించిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను  ఆదేశించారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.