మందమర్రి మినీ ట్యాంక్​బండ్​పై సీసీ కెమెరాల ఏర్పాటు

మందమర్రి మినీ ట్యాంక్​బండ్​పై సీసీ కెమెరాల ఏర్పాటు

కోల్ బెల్ట్, వెలుగు: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి చెరువు మీని ట్యాంక్​బండ్​పై గురువారం మున్సిపల్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాకర్స్​అసోసియేషన్​ప్రెసిడెంట్, స్థానిక కాంగ్రెస్​ లీడర్ ​బండి సందానందం యాదవ్​ వీటిని ప్రారంభించారు. 

మీని ట్యాంక్​బండ్​ను సందర్శించినప్పుడు ఇక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారించాలని మున్సిపల్​కమిషనర్​ను ఆదేశించారన్నారు. ట్యాంక్​ బండ్​పరిసరాల్లో ఏపుగా పెరిగిన పొదలు, చెట్లను తొలగించి శుభ్రం చేశారని, మహిళా వాకర్స్​కు సెక్యూరిటీ కోసం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.