శ్రీకాంతాచారికి నివాళ్లర్పించిన ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

శ్రీకాంతాచారికి  నివాళ్లర్పించిన ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

ఆదిలాబాద్/కోల్​బెల్ట్/భైంసా, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి శ్రీకాంతా​చారీ ఫొటోకు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడన్నారు. ఆయన త్యాగం వృథా కాలేదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఫలించిందన్నారు. కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.

 ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే పాయల్​ శంకర్ ​నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. భైంసాలో వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్​ సమీపంలోని శ్రీకాంతాచారి చౌరస్తాలో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.