నాపైన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చెయ్యను..మందకృష్ణ మాలలకు వ్యతిరేకంగా కాదు.. మోదీకి వ్యతిరేకంగా డప్పుకొట్టాలి : ఎమ్మెల్యే వివేక్

 నాపైన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చెయ్యను..మందకృష్ణ మాలలకు వ్యతిరేకంగా కాదు.. మోదీకి వ్యతిరేకంగా డప్పుకొట్టాలి	 : ఎమ్మెల్యే వివేక్

తనపై ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయనన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సంగారెడ్డిలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి.  సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం అంతా ఫేక్ అని అన్నారు.   మాలలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తామెప్పుడూ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. మాలల ఐక్యత, సంఖ్య చూపించుకునేందుకే సభలు పెట్టామని చెప్పారు. మాలల ఆత్మగౌరవం కోసమే సభలు పెట్టాం కానీ..మాదిగ గురించి కాదని చెప్పారు.   మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు .   బీజేపీ నేతలు వాళ్ల పార్టీలో పనులు చూసుకుంటే మంచిదని సూచించారు.  అంబేద్కర్   రిజర్వేషన్లు కల్పించినపుడు మాల మాదిగ లేదన్నారు వివేక్. 

సుప్రీం కోర్టు తీర్పును ఎవ్వరూ సరిగ్గాఅర్థం చేసుకోలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలలకు సంబంధించిన ఏ సభకైనా భారీ సంఖ్యలో తరలి రావాలి. మాల జాతిని కాపాడుకుందాం..మన హక్కుల కోసం పోరాడుదాం.  నేను  ఏ కార్యక్రమానికి వెళ్లినా మాలలను  అవమానిస్తున్నారు.  నాపై ఎన్ని విమర్శలు చేసినా నేను కేర్ చేయను.  540 పేజీల ఆర్డర్ లో సుప్రీం కోర్టు తీర్పును ఎంతమంది చదివారు..  సుప్రీం తీర్పు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంది.  మంద కృష్ణ మాదిగలను మభ్య పెడుతున్నారు.  మందకృష్ణ మాదిగ బీజేపీలో కలిసిపోయారు.  మాలకు వ్యతిరేకంగా కాదు..బీజేపీకి వ్యతిరేకంగా డప్పు కొట్టాలి. మాలలు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.  డిసెంబర్ 1న మాలల సింహగర్జన విజయవంతం చేశారు.  దళితులపై 3 వేల ఏండ్ల నుంచి కుల వివక్ష ఉంది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి.

ALSO READ | హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో  కేవలం 14 వేలకోట్లే దళితులకు కేటాయించారు.  కేసీఆర్ కూడా బడ్జెట్ లో ఎస్సీలకు నిధులు పెడతామని మాట తప్పారు.  ఎస్సీ డెవలప్ మెంట్ కోసం కేంద్ర రాష్ట్రాలు సహకరించట్లేదు అని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.