మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే పిల్లి సుధాకర్ పాదయాత్ర: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే పిల్లి సుధాకర్ పాదయాత్ర: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎస్సీల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మానకొండూరుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొని పిల్లి సుధాకర్ కు తన మద్దతు తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పిల్లి సుధాకర్ పాదయాత్ర చేపట్టారని.. ఈ యాత్ర సఫలీకృతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు వివేక్ వెంకటస్వామి.

మాలల ఐక్యత చాటేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన సభలన్నీ విజయవంతం అయ్యాయని..  ఈరోజు ( నవంబర్ 10, 2024 ) నిజామాబాద్ లో కూడా మాలల ఐక్యత సభ పెద్ద ఎత్తున జరగబోతోందని వెల్లడించారు. మాల కులస్తుల సమస్యల కోసం ఎక్కడ సభ జరిగినా పెద్ద ఎత్తున కులస్తులంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో మాలల సంఖ్య తక్కువగా ఉందని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు కానీ.. తెలంగాణలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని స్పష్టం చేశారు వివేక్ వెంకటస్వామి.