శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శం: వివేక్ వెంకటస్వామి

శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శం: వివేక్ వెంకటస్వామి

శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆద ర్భమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సి పాలిటీ పరిధిలోని పలు ఆలయాల్లో జరిగిన శ్రీ రామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు పంచముఖ హనుమాన్ ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యణంలో పాల్గొని స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ' శ్రీరాముడు సత్యానికి,న్యాయానికి, మంచి నీతి జీవనానికి నిలువెత్తు ప్రతిరూపం. భారతీయ సంస్కృతిలో శ్రీరాముడి జీవితం ఒక గొప్ప మార్గదర్శకం. శాంతి, సహనం, విశ్వాసం, కష్టనష్టాలను అధిగమించే స్థైర్యం వంటి విలువలను శ్రీరా ముని జీవితం మనకు నేర్పుతుంది. అందుకే శ్రీరాముడు అందరివాడు, ఆదర్శ పురుషుడు.

సీతారాములే ఈ లోకానికి ఆదర్శమూర్తులు, విలువలతో కూడిన రాజ్యపాలన చేశాడు. శ్రీరా మనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో మంచి పనులు చేయాలి. తోటి వారికి సాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి. సీతారాముల ఆశీస్సులతో అభివృద్ధిలో చెన్నూరు నియోజకవర్గాన్ని టాప్ లో నిలబెడుతా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నం. ప్ర భుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యా రంటీలను విజయవంతంగా అమలు చేశాం. త్వరలో 20 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నం. ' అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.