ఎమ్మెల్యే వివేక్​ సమక్షంలో  కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో శనివారం క్యాతనపల్లి మున్సిపల్​21 వార్డు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్​ పార్వతి విజయ కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్​కు ఎమ్మెల్యే వివేక్​ కాంగ్రెస్​ కండువా కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో క్యాతనపల్లి టౌన్​ కాంగ్రెస్ ప్రెసిడెంట్​పల్లె రాజు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాఘునాథ్​రెడ్డి, మాజీ బ్లాక్​కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ గోపతి రాజయ్య, సీనియర్​కాంగ్రెస్​ లీడర్లు ఎండీ అబ్దుల్​అజీజ్, గాండ్ల సమ్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, సత్యపాల్, గాదె రాంచందర్​తదితరులు  పాల్గొన్నారు.