గోపాల్ రావు మృతి.. కార్మికలోకానికి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి

గోపాల్ రావు మృతి.. కార్మికలోకానికి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి

బషీర్ బాగ్, వెలుగు: కార్మిక నాయకుడు, మాజీ కార్పొరేటర్  గోపాల్ రావు(76) మరణం కార్మికలోకానికి తీరని లోటు అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డలో మంగళవారం రాత్రి గోపాల్ రావు మృతి చెందారు. బుధవారం జరిగిన ఆయన అంతిమయాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొని.. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. 

నింబోలి అడ్డ నుంచి అంబర్ పేట్ స్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్ర లో ఆయన పాల్గొన్నారు. తన తండ్రి వెంకటస్వామితో కలసి గోపాల్ రావు కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారని వివేక్ గుర్తుచేసుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గోపాల్ రావు ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read : కొమరం భీం జిల్లాలో అగ్ని ప్రమాదం