పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన ఆయన.. పేదరికం నిర్మూలన కోసం ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. ఇందిరా గాంధీ పేద ప్రజల కోసం గరిభీ హఠావో పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు వివేక్.
దేశాన్ని నడిపించడానికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. ప్రజలు వారిని సేవలను ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ఇస్తారని.. ప్రజలు కూడా వాటి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశారు.. వారికి రేవంత్ రెడ్డి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను అందిస్తారని తెలిపారు వివేక్.