విశాక ట్రస్ట్ ద్వారా రెండు స్కూళ్లకు బెంచీలు

విశాక ట్రస్ట్ ద్వారా రెండు స్కూళ్లకు బెంచీలు

చెన్నూరు, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని గొల్లగూడెం, చెల్లాయిపేట ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లుకు శనివారం  బెంచీలు పంపిణీ చేశారు. వివేక్ యువసేన లీడర్ తనుగుల రవికుమార్ చేతుల మీదుగా ఈ బెంచీలను అందించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. బెంచీలు లేకపోవడంతో ఆ స్కూళ్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించిన ఆయన విశాక ట్రస్టు ద్వారా అందజేశారని పేర్కొన్నారు.

కాకా వెంకటస్వామి కుటుంబం విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఏండ్ల నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వందల స్కూళ్లకు బెంచీలు, బోర్లు, విశాక రేకులు అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఆ స్కూళ్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు ధన్యవాదాలు తెలిపారు.