ఓయూ, మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వచ్చే నెల 1న నిర్వహించనున్న మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, మాలల సింహగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మాలసంఘాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య, భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్, శంకర్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, ఓయూ ప్రొఫెసర్ సౌడ సవీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గడదాసు వెంకటేశ్వర్లు, ఉదయ్, మాజీ ఉద్యోగి శంకర్, ప్రేమ్ కుమార్, లెఫ్టినెంట్ నరేశ్ కుమార్, మాల విద్యార్థి జేఏసీ నాయకులు నూకమల్ల వీరస్వామి, మాదాసు రాహుల్, చిక్కుడు వెంకట్, పసరగొండ కిశోర్, సామ శ్రీను, రేణు, పండుగ భానుతేజ పాల్గొన్నారు.
మాలలు సంఘటితం కావాలి..
మన హక్కులను కాపాడుకునేందుకు మాలలు సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని, దీని కోసం మాలల సింహగర్జన సభకు హాజరు కావాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మల్కాజ్‌గిరి నేరేడుమెట్‌లోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి వివేక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ జిల్లా చైర్మన్ రాజు వస్తాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సమాజంలో మాలలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. మనం 30 లక్షల మందిమి ఉన్నామని, మన సత్తా ఎంటో చూపించాలన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య, కో ఆర్డినేటర్ సర్వయ్య, కో-చైర్మన్ జంగ శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.