
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 2 టీఎంసీలు చెన్నూరుకు విడుదల చేయాలని కోరారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో తాగు, సాగునీటి సమస్యపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు.
సాగు, తాగు నీళ్లు లేక చెన్నూరులో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఎమ్మెల్యే వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 12 టీఎంసీలు ఉన్నాయని..ఇందులో 2 టీఎంసీలు విడుదల చేసి చెన్నూరు రైతులను ఆదుకోవాలని మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు వివేక్. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు వివేక్.