ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ నుంచి 15% వస్తువులు కొనాలి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిక్వెస్ట్

ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ నుంచి 15% వస్తువులు కొనాలి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిక్వెస్ట్
  • చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి
  • అంబేడ్కర్ జయంతి రోజున ప్రకటించాలి

హైదరాబాద్: ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం కొనుగోలు చేసే వస్తువుల్లో 15% ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.  అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీనిపై ప్రకటన చేయాలని కోరారు. 

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ మేరకు దీనిని అమలు చేయాలని అన్నారు. ప్రతి యేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా  దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే ప్రకటన చేస్తోందని, ఈ సారి దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

►ALSO READ | సన్న బియ్యం మోడీ ఇస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి