ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వామి చొరవతో తీరిన నీటి కష్టాలు

ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వామి చొరవతో తీరిన నీటి కష్టాలు

కోటపెల్లి, వెలుగు: మండలంలోని సెట్​పల్లి ఎస్సీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. బోరు వేయించి నీటి కష్టాలు తీర్చాలని ఎస్సీ కాలనీవాసులు ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని చెన్నూరులోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. 

త్వరలోనే బోరు వేయిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ కాలనీలో సోమవారం బోరు వేయించి మోటార్ అందించారు. తమకు తాగునీటి కష్టాలు తొలగించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.