తెలంగాణ రాష్ట్రంలో 60 రోజుల్లో కులగణన పూర్తి: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

తెలంగాణ రాష్ట్రంలో 60 రోజుల్లో కులగణన పూర్తి: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

హైదరాబాద్, వెలుగు : రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఏ సామాజికవర్గం వారు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీసేందుకే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపడుతున్నార ని, ఇది 60 రోజుల్లో పూర్తయ్యే అవకా శం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవా రం గాంధీ భవన్​లో ఆయన మీడియా తో మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రూప్-1  పరీక్షలకు సంబంధించి కొన్ని అపోహలు వచ్చాయని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల సెలక్షన్  వివరా లను సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారని చెప్పారు. గ్రూప్-1లో అగ్రవర్ణాల వారికే మేలు జరుగుతున్న దని ప్రచారం జరిగిందని, దానిపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారన్నారు. 90 శాతానిపైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే సెలక్ట్ అయ్యారని సీఎం చెప్పారన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సెలక్షన్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారన్నారు.