అధికారులు సమన్వయంతో పనిచేయాలి :వివేక్ వెంకటస్వామి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి :వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరు టౌన్లో ప్రజాపాలన కార్యక్రమం 

మంచిర్యాల: చెన్నూరు టౌన్ లో ప్రజాపాలన కార్యక్రమం పై అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. ప్రజా పాలనలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా సమస్యల పరిస్కారానికి అధికారులుకృషి చేసి ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. 

అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోటపల్లి మండలంలో పర్యటించారు. మండలంలోని జనగామ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. తర్వాత మండలంలోని వెంచపల్లి గ్రామంలో పర్యటించారు. వెంచపల్లి గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో మంగళహారతులో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.