చెన్నూరులో మరో ఆరు నెలల్లో ఇంటింటికి తాగునీరు: ఎమ్మెల్యే వివేక్

చెన్నూరులో మరో ఆరు నెలల్లో ఇంటింటికి తాగునీరు: ఎమ్మెల్యే వివేక్

చెన్నూరు నియోజకవర్గంలో  తాగునీటి కోసం  రూ.30 కోట్లతో అమృత్ స్కీం పథకాన్ని ప్రారంభించమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మరో ఆరు నెలల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. మందమర్రి నేతాజీ నగర్ లో 20 లక్షల 15 ఫైనాన్స్ కమీషన్ నిధులతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.

ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్..  మందమర్రిలో రెండు కోట్ల రూపాయల నిధులతో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాం. గతంలో సైడ్ డ్రైనేజ్ లేకపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్వాసన దోమలు వెదజల్లడంతో రోగాల బారిన పడ్డారు. సైడ్ డ్రైనేజ్ నిర్మించాకే సీసీ రోడ్లు వేస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో అవసరం ఉన్నచోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నాం. జైపూర్ మండలానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల సాగునీరు అందించాలని ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం కుమార్ రెడ్డిని కోరాం. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాను. మందమర్రిలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశాం.

  జైపూర్ పవర్ ప్లాంట్ సామర్థ్యం 800 మెగావాట్స్ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరా.  త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పనులు ప్రారంభిస్తాం.  సింగరేణిలో కొత్త గనుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, సింగరేణి అధికారులతో చర్చించి కొత్త గనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం.  మందమర్రిలో అత్యాధునిక సౌకర్యాలతో  శ్మశాన వాటిక నిర్మిస్తాం. టీఎఫ్ఐడీసీ  నిధులతో చెన్నూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా  అని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.