రాజకీయాల్లో దేవుని ఆశీస్సులున్నాయి : వివేక్​ వెంకటస్వామి

  • సోదరుడు వినోద్​తో కలిసి వేడుకలకు హాజరు

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజలకు సేవ చేసేందుకు దేవుడి ఆశీస్సులున్నాయని, ప్రజా సమస్యల పరిష్కరిస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ ​జి.వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని సీఎస్​ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే, తన సోదరుడు గడ్డం వినోద్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము హైదరాబాద్ ​పబ్లిక్​ స్కూల్​లో చదివినప్పటి నుంచి ఏసుక్రీస్తు బోధనలు ఆచరించామని, తమకు క్రైస్తవ స్నేహితులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

 క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో పాస్టర్లు తనకు మోటివేషన్ చేసి ధైర్యం ఇచ్చారని వివేక్ పేర్కొన్నారు.కోల్​బెల్ట్, వెలుగు:వ్యాపారం, రాజకీయాల్లోనూ తనకు దేవుడు అండగా నిలిచాడన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి జీవితాంతం ప్రజలకు సేవలు చేశారని.. పేదలకు 70 వేల ఇండ్లు, 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 24 గంటలు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుంటానని, ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి రెస్పాన్స్ ఇస్తున్నట్లు వివేక్ చెప్పారు. 

అనంతరం ఎమ్మెల్యేలిద్దరూ క్రైస్తవ కుటుంబాలకు గిఫ్ట్​లు పంపిణీ చేశారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​బి.జనక్​ప్రసాద్, సీఎస్ఐ చర్చి పాస్టర్ జాషువా, పాస్టర్ ఇర్మియ, చర్చి కమిటీ సెక్రటరీ డేవిడ్, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం

సింగరేణిలో పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వివేక్​ వెంకటస్వామి, వినోద్​ అన్నారు. మందమర్రిలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్​ వెల్ఫేర్​అసోసియేషన్​ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ కమిటీలు ఐఎన్టీయూసీకి మద్దతు ఇస్తున్నట్లు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనుకుల తిరుపతి, బన్న లక్ష్మణ్​దాస్, దాసరి సుదర్శన్, భూపెల్లి కనుకయ్య తెలిపారు.

 టీఎన్టీయూసీ కూడా ఐఎన్టీయూసీకి మద్దతు పలుకుతుందని ఆ సంఘం బాధ్యులు సంజయ్​కుమార్, పెద్దపల్లి సత్యనారాయణ, మణిరాంసింగ్​పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ​లీడర్లు పలువురు ఐఎన్టీయూసీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​ జనక్​ ప్రసాద్, సీనియర్​ వైస్ ​ప్రెసిడెంట్లు కాంపెల్లి సమ్మయ్య, సిద్దంశెట్టి రాజమొగిలి, దేవి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.